కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. సీఎం అసభ్యంగా మాట్లాడుతున్నారని, పేగులు మెడలో వేసుకుంటా అని అంటున్నారని, ఇలాంటి దివాలాకోరు సీఎంను తాను ఎక్కడా కూడా చూడలేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. అలాంటివి ఎదుర్కోవడంపై పార్టీ పరంగా తాము దృష్టి సారించామన్నారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి లోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ నుంచి గతంలో అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామని ఆయన్ను పక్కన పెట్టారని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ లో ఓటర్ల పంచ్ పడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్ కు తగలాలన్నారు. కారు కావాలా.. బుల్డోజర్ కావాలా అనేది ఇక్కడి ఓటర్లే తేల్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
నోటిఫికేషన్ విడుదల
మరోవైపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 22 విత్ డ్రా చేసుకోవడానికి లాస్ట్ డేట్.24వ తేదీన పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. నవంబర్ 11న ఎన్నిక నిర్వహించనున్నారు. 14న కౌంటింగ్ ఉంటుంది.
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే.. అనారోగ్య కారణాలతో జూన్ 8న ఆయన కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి సునీతను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ లో దొంగ ఓట్ల కలకలం.. ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్!
కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. అలాంటివి ఎదుర్కోవడంపై పార్టీ పరంగా తాము దృష్టి సారించామన్నారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి లోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.