కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.