/rtv/media/media_files/2025/07/10/mlc-kavitha-vs-revanth-reddy-2025-07-10-16-04-58.jpg)
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ పాలిటిక్సేనని ధ్వజమెత్తారు. మేం మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తాం.. మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దామని సవాల్ విసిరారు. ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు పింఛన్లు పెంచడం లేదో చర్చిద్దామన్నారు. మీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: తెలంగాణపై లోకేష్ దారుణ కుట్ర.. ఇదిగో ప్రూఫ్.. డీజీపీకి దాసోజు శ్రావణ్ కంప్లైంట్!
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్
— RTV (@RTVnewsnetwork) July 10, 2025
పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారు
డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు
మేం మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తాం.. మహిళలకు నెలకు రూ.2,500 ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం
ఎందుకు తులం బంగారం… pic.twitter.com/QVuwyRSj8h
చంద్రబాబుకు బహిరంగ లేఖ..
గత కొన్ని రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్న కవిత ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఐదు గ్రామ పంచాయతీలు అయిన ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలన్నారు.
ఇది కూడా చదవండి:CM Revanth Reddy : తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఈ రోజు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి వాస్తు భయం ఉందన్నారు. దీంతో సచివాలయానికి కూడా రావడం లేదన్నారు. కానీ, మీడియా ముందు సవాళ్లు విసురుతూ హద్దులు మీరుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు మద్దతుగా 22న రైలు రోకో చేపట్టనున్నట్లు చెప్పారు.