/rtv/media/media_files/2025/09/06/harish-rao-2025-09-06-07-23-23.jpg)
Harish Rao
ఇటీవల కేసీఆర్(kcr) కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(kalvakuntla-kavitha) తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు(brs-mla-harish-rao) స్పందించారు. లండన్ నుంచి ఇండియాకు చేరుకున్న ఆయన విమానశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. గత కొంతకాలంగా మా పార్టీపైన, నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు వారెందుకు చేశారో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్న. కేసీఆర్ నాయకత్వంలో గత రెండున్నర దశాబ్ధాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ర్ట సాధనలో రాష్ర్ట అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే అన్నారు.
Harish Rao Political Journey
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న హరీష్
— Sarita Avula (@SaritaAvula) September 6, 2025
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం
తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ తెలుసు
కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:
ఆ వ్యాఖ్యలనే వారు ప్రస్తావించారు pic.twitter.com/cF7IB18nKQ
ఇది కూడా చూడండి:History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ ప్రత్యేకతలివే...
ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో ఓ వైపు రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వరద ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ దశాబ్ధకాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహుల చేతుల్లోంచి ఈ రాష్ర్టాన్నికాపాడుకునే విషయంలో మా దృష్టంతా ఉంటుంది. మేము ఈ రాష్ర్ట సాధనలో పోరాటం చేసినవాళ్లం . ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్లం. మా సమయాన్నంత కూడా దానిమీదనే వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ నాయకత్వలో తిరిగి బీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుని ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి:Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!