/rtv/media/media_files/2025/09/06/balapur-2025-09-06-06-59-03.jpg)
బాలాపూర్ లడ్డూ వేలానికి(balapur-ganesh-laddu-auction) సర్వం సిద్ధం అయింది. ఈ సారి వేలం పాటలో పాల్గొనేందుకు భారీ పోటీ నెలకొంది. కోటి ఖర్చైనా పర్లేదు..లడ్డూ సొంతం చేసుకుంటామంటున్నారు ఆశావహులు. గతేడాది కొలను శివారెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. రూ.30 లక్లలకు ఆయన లడ్డూను సొంతం చేసుకున్నారు.
Also Read : వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!
లిస్టులో ఉన్నది వీళ్లే
1.మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్)
2.సామ ప్రణీత్ రెడ్డి ( ఎల్బీ నగర్)
3. లింగాల దశరథ్ గౌడ్ (కర్మన్‌ఘాట్)
4.కంచర్ల శివారెడ్డి (కర్మన్‌ఘాట్)
5.సామ రాంరెడ్డి (కొత్తగూడెం)
6. PSK గ్రూప్ ( హైదరాబాద్)
7.జిట్ట పద్మాసురేందర్ రెడ్డి (చంపాపేట్)
బాలాపూర్ లడ్డూకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ వేలం 1994లో కేవలం రూ.450తో మొదలైంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలతో ఇది రికార్డులను సృష్టిస్తోంది. ఈ లడ్డూను గెలుచుకున్నవారికి అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారు.
2024లో రూ. 30లక్షలు
2023లో రూ.27 లక్షలు
2022లో రూ.24 లక్షలు
2021లో రూ.18 లక్షలు
Also Read : కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!