Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం.. రన్-వేపైనే ఆగిపోయిన విమానం..
శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అలయన్స్ ఎయిర్ లైన్స్ రన్-వే పైనే నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణీకులను సైతం రన్వేపై నిలిపివేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఈ అలయన్స్ విమానం దాదాపు గంటకు పైగానే రన్ వే పైనే ఉండిపోయింది.