Engineering: బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
కేంద్రంలో పలుకుబడి ఉందని రెచ్చిపోవద్దని చంద్రబాబుని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మీరు చెబితే మోదీ వింటాడు కావొచ్చు.. కానీ తెలంగాణ ప్రయోజనాలను వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌లకు అన్నీ అనుమతులు వస్తాయనుకుంటే అది మీ భ్రమ అన్నారు.
బనకచర్ల అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానిని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలంగాణాకు న్యాయం జరగకపోతే.. లీగల్ ఫైట్ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మా ప్రభుత్వానికి రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం తెలిపారు.
తెలంగాణలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాయితేజ, వాసా పవన్‌కుమార్, వాసా రాఘవేందర్ మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు.
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా NH 44 జాతీయ రహదారిపై లారీలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ లారీల వెనుక వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లా అప్పన్నపల్లిలో రహస్యంగా నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపింది. పవన్ కుమార్ అనే వ్యక్తి కుమారుడు గణేష్ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతను ఆరోగ్యం మెరుగవుతుందని పెంటోజితోపాటు మరో వ్యక్తి సహాయంతో ఈ పూజలను నిర్వహించాడు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
గద్వాల్లో భర్త, కుమార్తె ఉన్న తల్లి పుల్లన్న అనే వ్యక్తితో వెళ్లిపోయింది. కూతురిని చూడాలనిపించి తిరిగి రావడంతో గొడవలు జరిగాయి. మనస్తాపం చెంది ఆ వ్యక్తి పురుగులు మంది తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ మహిళ ఇంట్లోనే ఉరేేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నాగర్‌కర్నూల్ చెన్నంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ అనే మహిళకు తన ఏడేళ్ల కూతురిని గొంతులు నులిమి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని నీటి మడుగులో పడేసింది. కూతురిని మాత్రమే కాదు గతంలో ఎల్లమ్మ తన భర్తను కూడా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.