Cm Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ!
TG: సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు అక్కడ జరిగే CWC సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ వెళ్లనున్నారు.