రేవంత్ కు బిగ్ షాక్.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి BRSలోకి!

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు నలుగురు తిరిగి సొంత గూటికి చేరుతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దానం నాగేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఈ లిస్ట్ లో ఉన్నారు.

New Update

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్, కేటీఆర్ పొగిడిన అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఆయన హైడ్రాను తప్పు పట్టడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో కాంగ్రెస్ లో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడని.. త్వరలోనే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతాడన్న ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది.

ఆ నలుగురు కూడా..

దానం నాగేందర్ తో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మరో నలుగురు సైతం యూటర్న్ తీసుకోనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్ లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉన్నారు. ఈ విషయమై వీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సైతం టచ్ లోకి వెళ్లి సంప్రదింపులు నడపుతున్నారని కూడా సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. 

నిజంగానే చేరితే పాలిటిక్స్ లో పెను మార్పులు..

అయితే.. ఈ ప్రచారంపై ఈ నలుగురు ఎమ్మెల్యేలు స్పందించలేదు. దీంతో ఈ అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయనే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ ఈ ఎమ్మెల్యేలు నిజంగానే బీఆర్ఎస్ లో చేరితే తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు