గుండెపోటుతో మాజీ ఎంపీ కన్నుమూత‌

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. ట్రీట్‌మెంట్ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స తీసుకుంటూ ఆయన ఆదివారం (ఈరోజు) సాయంత్రం కన్నుమూశారు.

author-image
By K Mohan
New Update
image111

image111 Photograph: (image111)

నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం ఆదివారం తుదిశ్వాస విడిచారు. గతంతో ఆయకు గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆయన ఆదివారం (ఈరోజు) సాయంత్రం కన్నుమూశారు. మంద జగన్నాథం నాలుగు సార్లు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో మంద జగన్నాథం పని చేశారు. ప్రస్తుతం బీఎస్పీ పార్టీలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: Who is Sayali Satghare: అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టేసింది!

నాగర్‌కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో మంద జగన్నాథం జన్మించారు. మెడిసిన్‌లో ఎం.ఎస్. పూర్తి చేశారు. ఆయనకు సావిత్రితో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. తెలుగు దేశం పార్టీతో ఆయన రాజకీయం ప్రారంభమైంది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా కూడా పని చేశారు. నాగర్ కర్నూల్ నుంచి 1996, 1999, 2004 మూడు సార్లు తెలుగుదేశం తరపున, 2009లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచారు. 

ఇది కూడా చదవండి: Working Hours: ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలేంటో తెలుసా ?

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంద జగన్నాథం ఓడిపోయాడు. ఆ తరువాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2022 జూలై 1న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జగన్నాథ్ ను నియమించారు. తర్వాత బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2024లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు