రేవంత్ సర్కార్ పైన యుద్ధం చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శి జాన్ వెస్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన నేపథ్యంలో RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ చేస్తున్న వర్గీకరణ ఉద్యమానికి సీపీఎం మద్దతు ఉంటుందని గతంలోనే ప్రకటించామన్నారు. బీజేపీ పక్కన ఉంటే మంద కృష్ణ మాదిగను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ మత విద్వేషాల రాజకీయం చేస్తోందన్నారు. లగచర్లలో ఇంటింటికి తిరిగి రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చామన్నారు. తమ పోరాటానికి ఫలితంగానే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుందన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలన్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటంలో బీఆర్ఎస్ పాల్గొనాలన్నారు. జాన్ వెస్లీ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
CPIM: రేవంత్ పై ఇక యుద్ధమే.. సీపీఎం కొత్త కార్యదర్శి జాన్ వెస్లీ సంచలన ఇంటర్వ్యూ!
హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్ పై యుద్ధం చేస్తామని సీపీఎం తెలంగాణ నూతన కార్యదర్శి జాన్ వెస్లీ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీ పక్కన ఉంటే మంద కృష్ణ మాదిగను వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు.
New Update
తాజా కథనాలు