/rtv/media/media_files/2025/01/26/mkEXA9TJpDkCYQk1j6bR.jpg)
tirupathi reddy Photograph: (tirupathi reddy)
కొడంగల్ నియోజవర్గాన్ని ఎలాగైనా ముంచాలని కేసీఆర్ చూస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని ప్రసంశించారు. ఎలాంటి పదవులు ఆశించకుండా తిరుపతి రెడ్డి ప్రజాసేవ చేస్తుంటే.. ఆయన్ని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. కొడంగల్ ప్రజల అభివృద్ధికి ఆయన అండగా ఉండి ప్రజా సమస్యలు తీరుస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కేసీఆర్‌లా తానేమి కుటుంబ పాలన చేయడం లేదని వివరించారు.
ఇది కూడా చదవండి : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి... కీలక ప్రకటన
నారాయణపేట జిల్లా కొస్గి మండలం చంద్రవంచలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి 4 ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా 734 మంది రైతులకు రైతు భరోసా చెక్కుల అందజేశారు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత రైతులందరికీ రైతు భరోసా జమ అవుతుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!
గ్రామ సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తి ఊళ్లో లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం.. మరి 13 నెలల నుంచి ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావట్లే కదా ఆయన్ని ఏం అనాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నామని అన్నారు. రైతు భరోసాతో రైతులకు రూ.12 వేలు ఇస్తున్నామని, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రూ.12 వేలు ఇస్తున్నామన్నారు.