CPI(M): సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. 70 ఏళ్లకు పైబడిన వారిని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నుంచి తప్పించారు. దీంతో గత మూడు సార్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన తమ్మినేని వీరభద్రం కార్యదర్శి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

New Update
CPIM Telangana New Secretary

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. 70 ఏళ్ళు దాటిన నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన పలికారు. దీంతో వయసు రీత్యా రాష్ట కమిటీ నుంచి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, నర్సింగ రావు తప్పుకోవాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి తమ్మినేని వీరభద్రం మూడు సార్లు తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి లో ఈ నెల 25 నుంచి సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నారు. సభలో కొత్త కార్యదర్శి ఎన్నికను నిర్వహించారు. 
ఇది కూడా చదవండి: Padma Awards 2025: గద్దర్ మావోయిస్టు....పద్మ అవార్డు ఇవ్వం... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

జాన్ వెస్లీ బ్యాగ్రౌండ్ ఇదే..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అమరచింతకు జాన్ వెస్లీ సీపీఎం పార్టీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. డీవైఎఫ్ఐ,కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు. గతంలో తమ్మినేని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన మహా ప్రస్థానం పాదయాత్రలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ చరిత్రలో రాష్ట్రంలో దళిత నేతను కార్యదర్శిగా నియమించడం ఇది తొలిసారి. 
ఇది కూడా చదవండి: KTR Vs Komatireddy: దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ దగ్గరకు రా.. కోమటిరెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్!

కేంద్ర కార్యవర్గంలోకి తమ్మినేని..

ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రంను కేంద్ర కార్యవర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి ఎంపీగా, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించి ఆ జిల్లాను పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దారు. రాష్ట్ర పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంత తర్వాత వరుసగా మూడు సార్లు ఏకగ్రీవంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు