పురిటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్ష రాసిన మహిళ..
నాగర్కర్నూల్ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రేవతి అనే మహిళ పురిటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్షలు రాశారు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. కానీ రేవతి ఇందుకు ఒప్పుకోలేదు. పట్టువదలకుండా పరీక్ష రాశారు.