TG News: కార్యకర్తలు చెప్పినవారికే కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం!
నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రభుత్వ పథకాలపై సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు చెప్పినవారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఆ లిస్ట్ ప్రకారమే ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.