Rat Hole Miners : చేతులెత్తేసిన ర్యాట్ హోల్ మైనర్స్..కష్టమేనని వ్యాఖ్య

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8మంది కార్మికులను రక్షించడానికి టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లిన ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందం బయటకు వచ్చేసింది. వారిని రక్షించడం కష్టమేనని వ్యాఖ్యనించింది.

New Update
Rat Hole Miners

Rat Hole Miners

Rat Hole Miners : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8మంది కార్మికులను రక్షించడానికి టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే 8 మంది కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లిన ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందం తిరిగి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా 8 మందిని రక్షించడం కష్టమేనని వ్యాఖ్యనించింది. సహాయక చర్యల్లో భాగం కావడానికి వచ్చిన ర్యాట్‌ హోల్‌ మైనర్స్ సభ్యులు ఆరు గంటలపాటు టన్నెలో ఉండి బయటకు వచ్చేశారు. లోపల రెస్క్యూ చేయడం కష్టంగా ఉందని వారు వ్యాఖ్యానించారు.లోపల ఎలాంటి మూవ్‌మెంట్ కనిపించడం లేదని,బురద, నీళ్లు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అధికారుల ఆదేశాలతో మరోసారి ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఇది కూడా చూడండి:This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

 SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన జరిగి మూడు రోజులు దాటినా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. NDRF, SDRF, నేవీ, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తాజాగా టన్నెల్లోకి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్ తిరిగి వచ్చేసింది.2023లో ఉత్తరాఖండ్‌లో సొరంగంలో చిక్కుకున్న 41 మందిని  ర్యాట్ హోల్ టీమ్ రక్షించింది. ఈ ఘటనలోనూ ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్‌పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. టన్నెల్స్‌లో చిక్కుకున్న వారిని రక్షించడంలో ర్యాట్ హోల్‌ టీమ్‌కు మంచి పేరుంది. నసీం, ఖలీల్ ఖురేషీ, మున్నా, మహమ్మద్ రషీద్, ఫిరోజ్ ఖురేషీ, మహమ్మద్ ఇర్షాద్ లు ర్యాట్ హోల్ టీమ్‌లో కీలక సభ్యులుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి:ఇలా తింటే కరివేపాకుతో కూడా బరువు తగ్గొచ్చు

SLBC టన్నెల్లో బురద నీరు పెరుగుతోంది.బురద నీటిని బయటకు తరలించేందుకు భారీగా పంప్‌లు ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ నేవీ కమాండర్ యూనిట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి కాలరీస్, జియోలాజీకల్ సర్వే ఆఫ్ ఇండియా, నవయుగ కంపెనీ, ఎల్ అండ్ టీ కంపెనీ, నేషనల్ జియోలాజికల్ టీమ్స్ తదితర బృందాలు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి.

Also read :  తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పై లోకేష్ ప్రకటన..! ఎప్పటి నుంచంటే...

Also Read :  ఏపీలో కుల పిచ్చి.. అప్పటి వరకే టీడీపీతో.. పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

Advertisment
తాజా కథనాలు