SLBC: కార్మికుల జాడ కోసం GPR స్కానింగ్.. ఇది ఎలా కనిపెడుతుందో తెలుసా?

SLBC ప్రమాదంలో చిక్కుకున్న 8మంది కార్మికులను కాపాండేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే అత్యాధునిక గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (GPR) టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇది భూగర్భంలోని వస్తువులు, మానవ అవశేషాలను గుర్తించనుంది.

New Update
GPR Test

SLBC - GPR Test - Last Chance

SLBC: SLBC ప్రమాదంలో చిక్కుకున్న 8మంది కార్మికులను కాపాండేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే అత్యాధునిక గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ (GPR) టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇది భూగర్భంలోని వస్తువులు, మానవ అవశేషాలను గుర్తించనుంది.

భూ గర్భంలోకి చొచ్చుకెళ్లి...

ఈ మేరకు గురువారం జీపీఆర్‌ పరికరాన్ని సొరంగం లోపలికి పంపించింది. మిషన్ కూలిన చోట మట్టి, శిథిలాల కింద క్షుణ్ణంగా పరిశీలించనుంది. భూమిలో కొంత దూరం వరకు ఏమీ ఉన్నాయో గుర్తిస్తుంది. దీంతో గల్లంతైన కార్మికులు శిథిలాల కింద ఎక్కడున్నారో తెలిసే అవకాశాలు ఉన్నాయి.  సొరంగంలో జీపీఆర్‌ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను శుక్రవారం నిపుణులు విశ్లేషించే అవకాశం ఉంది. 

ఎలా పనిచేస్తుందంటే..

జీపీఆర్‌ విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరిస్తాయి. అక్కడున్న రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్‌ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్‌ రూపొందిస్తుంది. మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలుంటే గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులభం అవుతుంది. అదే ప్రాంతంలో తవ్వకాలు జరిపి దేహాలను బయటికి తీసుకురావొచ్చు. 

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

చివరివరకు వెళ్లిన బృందాలు..

ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, బీఆర్‌వో, ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, ఎల్‌అండ్‌టీ తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. నిన్న సాయంత్రానికి టన్నెల్ చివర వరకు కూడా వెళ్లగలిగారు. అయితే ఎక్కడా కార్మికుల జాడ మాత్రం కనిపించలేదు. ఎటుచూసినా మట్టి దిబ్బలు, బురదే కనిపిస్తోంది. దానికి తోడు టన్నెల్‌లో ప్రతి నిమిషానికి ఐదు వేల లీటర్ల నీళ్లు ఊరుతుండటం, ఇప్పటికే భారీగా బురద, రాళ్లు మేటవేసి ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది.

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

9.2 మీటర్ల ఎత్తులో మట్టి.. 
ఎంత దూరం వెళ్ళినా శిథిలాలే కనిపిస్తున్నాయి తప్ప ఎనిమిది మంది కార్మికుల జాడ కనిపించడం లేదని చెబుతున్నారు ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్. టన్నెల్ ఎత్తు 10.2 మీటర్లు అయితే ప్రమాదం జరిగిన చోట దాదాపు 9.2 మీటర్ల ఎత్తులో మట్టి దిబ్బలున్నాయి. అందులోనే టీబీఎం మిషన్ కూడా కూరుకుపోయింది. గాలి కోసం ఏర్పాటు చేసిన భారీ పైపు కూడా కూలి టీబీఎం మిషిన్ మీద పడింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు బతికుండడంపై మరిన్ని అనుమానాలు ముసురుకున్నాయి. గల్లంతైన వారు టీబీఎం మిషన్ చుట్టూ  బురదలో కూరుకుపోయి ఉంటారని చెబుతున్నారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు