Telangana Government: రాష్ట్ర ప్రజలకు షాక్.. లక్షా 36వేల రేషన్ కార్డులు తొలగింపు!

అనర్హులను రేషన్ కార్డు జాబితా నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉండగా.. లక్షా 30 వేల కార్డులను రద్దు చేయనుంది. భారీగా ఆస్తులు ఉన్నవారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే.

New Update
ration cards cancel

ration cards cancel Photograph: (ration cards cancel)

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్ కార్డులు(New Ration Cards) పంపిణీ చేయనుంది. అయితే కొంతమందిని రేషన్ కార్డ్ జాబితా నుంచి తొలగించాలని చూస్తోంది. అర్హులుకాని వారు కూడా రేషన్ కార్డును కలిగి ఉన్నారని గతంలో చాలా ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌరసరఫరా శాఖ అధికారులు(Civil Supplies Department Officials) లిస్ట్ తయారు చేశారు. కార్లు, పొలాలు, బిల్డింగులు, భారీగా ఆస్తులున్న వారి రేషన్ కార్డు కట్ చేయాలని చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షా 36 వేల రేషన్ కార్డుదారులు అనర్హులై రేషన్ తీసుకొంటున్నారని అధికారుల పరిశీలనలో తేలింది. అన్నీ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో పథకాల అమలులో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. పేద వారు కాకున్నా రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారు. వారి పేరున ఉన్న రేషన్ కార్డులు తీసుయనున్నారు.

Also Read: Delhi AIIMS: ఢిల్లీలోని ఎయిమ్స్‌‌లో అరుదైన ఆపరేషన్.. పొట్టలోని 2 కాళ్లు తొలగింపు

లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ..

కొత్తగా వచ్చే రేషన్ కార్డు్లో చనిపోయిన వారిని తొలగిస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మార్చి 1న తెలంగాణ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో మరో లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. దీంతో అర్హులు కాకుండా రేషన్ తీసుకుంటున్న వారిపై కూడా రాష్ట్ర ప్రభుత్వ ఫొకస్ చేసింది. వెంటనే వారి పేర్లు రేషన్ కార్డు జాబితా నుంచి తీసేయాలని నిర్ణయించుకుంది. అదే విధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు గానే పదేళ్లుగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. వాటిని మండల అధికారులు పరిశీలించి అప్రూవల్ ఇవ్వనున్నారు. మరో వారంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగియనుండటంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రేషన్ కార్డు పంపిణీ చేయనున్నారు.

Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!

Also Read: Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com

Also Read: SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు