/rtv/media/media_files/2025/02/26/M0oXbHV7ehN2Cu9evjOx.jpg)
BRS MLA Bandla Krishna Mohan Reddy
జోగులాంబ గద్వాల జిల్లా.. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. కానీ తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందనే భయంతో ఆయన బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకుంటున్నారా ? అని సంచలనం రేపుతోంది.
Also Read: తమిళనాడులో విజయ్ పార్టీని గెలిపిస్తా.. ధోని కంటే ఫేమసవుతా : ప్రశాంత్ కిషోర్
పోలీసులకు చేసిన ఫిర్యాదులో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఈ విధంగా పేర్కొన్నారు. '' నేను గద్వాల ఎమ్మెల్యే బి.బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి ప్రాతనిధ్యం వహిస్తున్నాను. గద్వాల్ టౌన్‌లోని పబ్లిక్ ప్రాంతాల్లో అనధికారికంగా నా ఫోటోను ఫ్లెక్సిల్లో వేశారు. నేను బీఆర్‌ఎస్ నుంచి గెలిచినప్పటికీ కొందరు కావాలనే కాంగ్రెస్ పార్టీతో ఉన్నట్లు ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్య కేవలం తప్పుదోవ పట్టించడమే కాదు, ప్రజల్లో నా గురించి గందరగోళం సృష్టించి, తప్పుదారి పట్టించడమే. ఎన్నికలు జరిగినప్పటి నుంచి నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాను. నాపై ఇలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని'' బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి రాసుకొచ్చారు. ఫిబ్రవరి 11న ఆయన పోలీసులకు చేసిన ఫిర్యాదు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇదిలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులకి పలువురు ఎమ్మెల్యేలతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు గద్వాలలో జెడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య (కాంగ్రెస్)తో కూడా బండ్లకు విభేదాలు ఉన్నాయి. అయితే తాను నిజంగానే బీఆర్‌ఎస్‌లోనే ఉండాలనుకుంటున్నారా ? లేదా అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే ఇలా పోలీసులకు ఫిర్యాదు చేశారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: డీలిమిటేషన్ అలా చేస్తేనే మంచిది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. '' ఇలాంటిది నేను ఎక్కడా చూడలే. కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు తెలియకుండా నా ఫొటోలు ఫ్లేక్సీలో వేశారు.. వాళ్లపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అనర్హత వేటు పడుతుందోననే భయంతోనే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని'' కేటీఆర్ విమర్శించారు.