BIG BREAKING: లగచర్లలో భూసేకరణలో బిగ్ ట్విస్ట్.. ఆ రైతులకు కలెక్టర్ సన్మానం!

లగచర్లలో 22 మంది రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ పార్క్ కు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. సర్వే నంబర్ 101లోని 100 ఎకరాల భూమిని కలెక్టర్ కు అందించారు. వారిని సన్మానించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ నష్టపరిహారం చెక్కులను అందించారు.

New Update
Lagacharala Issue

Lagacharala Issue

లగచర్లలో ప్రభుత్వం చేపట్టిన ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. 22 మంది రైతులు లగచర్లలోని సర్వే నం.101 లో ఉన్న 100 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఆయా రైతులను కలెక్టర్ సన్మానించారు. వారికి ఒకే దఫాలో మొత్తం నష్టపరిహారం చెక్కులను అందించారు. 

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోని దూద్యాల మండలంలో ఫార్మసిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇక్కడ ఫార్మాసిటీ వద్దని ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 11న ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి జరిగింది. దీంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. పలువురు స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. అనంతరం ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు