HCU భూముల వెనుక రూ.10 వేల కోట్ల స్కామ్.. ఆ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు: కేటీఆర్

రేవంత్ ప్రభుత్వం HCU భూములతో రూ.10 వేల కోట్ల స్కామ్‌కు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు ఓ బీజేపీ ఎంపీ వెనుక నుంచి సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే రూ.60 వేల కోట్ల విలువైన HMDA భూముల ద్వారా ప్రభుత్వం దోపిడీకి యత్నిస్తోందన్నారు.

New Update
KTR

KTR

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 'మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం' అనే 3డీ మంత్రాన్ని అమలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కంచ బౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం విస్తుపోయిందని తెలిపారు. HCUలోని 400 ఎకరాలు అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఆధారంగానే తాను ఈ విషయాన్ని చెబుతున్నట్లు పేర్కొన్నారు.  

Also Read: TGPSC మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన!

'' రేవంత్ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల స్కామ్‌కు ప్రయత్నిస్తోంది. సీఎంకు బీజేపీకి చెందిన ఓ ఎంపీ వెనుక నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఓ బ్రోకరేజ్ కంపెనీతో చర్చలు జరిపారు. FRBMను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని.. ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని చెప్పింది. ఇందుకోసం ఏకంగా ఆర్‌బీఐ నిబంధనలు, చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కారు. 

Also Read: ఆర్మీలో డాక్టర్ టెర్రరిస్ట్ గ్రూప్‌ మాస్టర్ మైండ్‌గా ఎందుకు మారాడు..?

KTR Comments On Kancha Gachibowli Lands Issue

రేవంత్‌.. తనకు అండగా ఉన్న బీజేపీ ఎంపీకి లబ్ధి చేకూరుస్తున్నారు. స్కామ్‌కు సహకరించిన ఎంపీ పేరును వచ్చే ఎపిసోడ్‌లో చెబుతా. అన్ని ఆధారాలతో దీనిపై కేంద్రానికి లేఖ రాస్తా. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి తెలియకుండా ఇది జరిగిందని అనుకుంటున్నాను. రేవంత్ కేవల 400 ఎకరాలు మాత్రమే కాదు. రూ.60 వేల కోట్ల విలువైన HMDA భూముల ద్వారా కూడా దోపిడి చేసేందుకు ప్లాన్ వేశారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణకు ఆదేశించాలని'' కేటీఆర్ డిమాండ్ చేశారు.  

Also Read: కరోనా పేషెంట్‌పై అత్యాచారం చేసి క్షమాపణలు... కోర్టు సంచలన తీర్పు!

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

hcu lands | rtv-news | telugu-news | latest telangana news | telangana news today | telangana news live | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు