/rtv/media/media_files/2025/04/11/QyVJ7rdS8cLi6L5ydf9l.jpg)
nasik school
పాఠశాల విద్యార్థుల బ్యాగ్స్ చెక్ చేసిన టీచర్లు కంగుతిన్నారు. అసలు వాళ్ల బ్యాగ్‌లో ఏం ఉన్నాయో తెలిస్తే.. వీళ్లు స్టూడెంట్స్ ఏనా అన్న డౌట్ మీకూ వస్తుంది. మహారాష్ట్ర నాసిక్‌లో ఇగత్‌పురి తాలూకాలోని ఘోటి గ్రామంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి పిల్లల బ్యాగ్స్ యాజమాన్యం తనిఖీలు చేసింది. బ్యాగ్ ఓపెన్ చేసి చూడగానే స్కూల్ స్టాఫ్ షాక్ అయ్యారు. చదివేది 8వ తరగతి, వాళ్లంతా చిన్న పిల్లలూ.. కానీ వాళ్ల స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, నకిల్‌డస్టర్లు (చేతి కడియాలు) కనిపించాయి. వాళ్ల అవతారాలు హెయిర్ స్టైల్ వికృతంగా ఉందని అనుమానం వచ్చి ఓ టీచర్ బ్యాగ్ చెక్ చేశాడు. టీచర్లు ఈ బ్యాగ్‌లో దొరికిన వస్తువులు అన్నీ వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read: Egg prices: కోడిగుడ్డుకు రెక్కలు.. కోళ్లను అద్దెకు తెచ్చకుంటున్న అమెరికన్స్
ℕ𝔸𝕊ℍ𝕀𝕂 | A shocking incident has come to light in Nashik, Maharashtra. In a private school in Ghoti, Igatpuri taluka, teachers found alarming items in students' bags, including knives, playing cards, condoms, and bicycle chains. The teachers had decided to inspect the bags… pic.twitter.com/3HOiplTGLu
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) April 8, 2025
Also read: Helicopter Crash: హెలికాఫ్టర్ క్రాషై కుటుంబ సభ్యులు మొత్తం మృతి
ఇంకో విషయం ఏంటంటే ఈ రకమైన వస్తువులు పిల్లల బ్యాగ్‌లో దొరకడం ఇదేం ఫస్ట్ టైం కాదట. తరుచూ ఆ స్కూల్లో ఇలాంటి వస్తువులు దొరికుతాయి. అయితే అలా దొరికిన వెంటనే వారి పేరెంట్స్ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని స్కూల్ ప్రిన్సిపాల్ చెబుతున్నారు. పిల్లలను మార్చడానికి తాము ఎంత ప్రయత్నించినా.. ఇంత చిన్న వయసులోనే చెడిపోతున్నారని ఉపాద్యాయులు బాధపడుతున్నారు. అయితే అదే సమయంలో బ్యాగ్‌లో డ్రగ్స్ కూడా ఉన్నాయని పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయంపై పోలీసులు స్కూల్‌లోకి వచ్చి సదరు పిల్లల బ్యాగ్ చెక్ చేశారు. అయితే అందులో ఉన్నవి డ్రగ్స్ కాదని, అవి తంబాకు ప్యాకెట్లు అని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.