/rtv/media/media_files/2025/04/11/muptbzdq3pcMBBDW8xvO.jpg)
corona patient kerala
కరోనా పేషెంట్‌పై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు జైలుశిక్ష విధిస్తూ కేరళలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కాయంకుళంకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్‌ను దోషిగా తేల్చింది. ఈ ఘటన 2020 సెప్టెంబర్ 5 నాటిది. 19 ఏళ్ల యువతికి కరోనా సోకడంతో వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే వెంటనే అంబులెన్స్‌లో ఆమెను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయగా.. నౌఫాల్ అనే డ్రైవర్ డ్యూటీలో ఉన్నాడు.
యువతిపై కన్నేసిన డ్రైవర్
యువతిని కోవిడ్ కేర్ సెంటర్‌కు పేషెంట్‌ను తరలిస్తున్న టైమ్ లో యువతిపై కన్నేసిన డ్రైవర్ నౌఫాల్ అంబులెన్స్ ను మరో రూట్ లోకి తీసుకువెళ్లి.. అక్కడ పేషెంట్‌పై లైంగికంగా దాడి చేశాడు. అనంతరం ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఆ సమయంలో యువతి అతడి మాటల్ని ఫోన్ లో రికార్డు చేసింది. ఆ వీడియో తరువాత దోషిగా నిర్ధారించడంలో కీలక సాక్ష్యంగా మారింది. కేర్ సెంటర్‌కు వచ్చిన తర్వాత అత్యాచార ఘటనకు సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులకు వెల్లడించింది. దీంతో వారు పోలీసులకు అలెర్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసులో నౌఫాల్‌కు కోర్టు జీవితఖైదు జైలుశిక్ష విధించింది.
Also read : HYD: ఇన్నాళ్ళూ లీజ్, ఇప్పుడు ఓనర్..లులూ యాజమాన్యం చేతికి మంజీరా మాల్
Also read : తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ
Also Read : Manchu Manoj: వీడు కన్నప్ప కాదు 'దొంగప్ప'.. మంచు మనోజ్ సంచలన ట్వీట్!