/rtv/media/media_files/2025/04/11/OluqxFoddleEw84PHG1N.jpg)
Govt Job Recruitment in Telangana
టీజీపీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు రిక్రూట్ మెంట్ ప్రక్రియలో రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా సర్టిఫికెట్ల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే నిర్వహించిన 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియలో కూడా టీజీపీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు ఇదే విధానాన్నే అమలు చేసింది. అయితే త్వరలో మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో తదితర పోస్టుల భర్తీకీ ఇదే విధానాన్ని టీజీపీఎస్సీ అవలంబించింది. అంతేకాకుండా తదుపరి నోటిఫికేషన్లలోనూ ఈ విధానాన్ని టీజీపీఎస్సీ అమలు చేయనుంది.
గవర్నమెంట్ జాబుల కోసం పోటీపరీక్షలు నిర్వహించి, అందులో వచ్చిన మార్కులు, మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ కలిగిన అభ్యర్థులను సర్టిఫికెట్ల పత్రాల పరిశీలనకు టీజీపీఎస్సీ పిలువనుంది. ఇప్పటివరకు మల్టీజోనల్, జోనల్ పోస్టులకు 1:2 , జిల్లా పోస్టులకు 1:3, దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో పిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల టీజీపీఎస్సీ భర్తీ చేసిన పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పత్రాల పరిశీలనకు పిలవగా వందకు వందశాతం హాజరైనట్లు సమాచారం.
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనప్పటికీ
ఊదాహరణకు ఒక డిపార్టుమెంట్ లో 50 పోస్టులు ఉంటే.. 1:2 నిష్పత్తిలో 100 మంది అభ్యర్థులను పిలుస్తున్నారు. అంటే అదనంగా పిలిచిన 50 మందిలో ఆశలు కల్పించినట్లు అవుతోంది. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనప్పటికీ పోస్టులు రాకపోవడంతో మిగిలిన అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఎక్కువ మంది అభ్యర్థులను పరిశీలనకు పిలవడంతో రోజుల తరబడి సర్టిఫికెట్లపత్రాల పరిశీలనతో భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుండడమూ ఈ సంస్కరణ తేవడానికి ఒక కారణంగా ఉంది. అలానే ఇంటర్వ్యూలు ఎత్తివేయడమూ మరో కారణంగా కూడా ఉంది.
Also Read : Manchu Manoj: వీడు కన్నప్ప కాదు 'దొంగప్ప'.. మంచు మనోజ్ సంచలన ట్వీట్!