Bandi Sanjay: ఖబడ్దార్.. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?
చెంగిచర్లలో ఎస్టీ సామాజికవర్గ మహిళలపై జరిగిన దాడిని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. మహిళలనే ఇంగిత జ్ఞానం లేకుండా గూండాలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. తమ సహనాన్ని చేతకానిదిగా భావిస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.