Eatala Rajender: ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు కూడా నాకే.. వారు నాకిచ్చిన భరోసా ఇదే: ఈటల

మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు కూడా తనకేనని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేలకు అందని ఫలితం మల్కాజ్ గిరిలో రాబోతోందన్నారు. ఈ రోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

New Update
National: నెహ్రూ తర్వాత ఆ ఘనత మోడీకే దక్కింది.. ఈటల రాజేందర్!

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 రోజులుగా మల్కాజ్ గిరి లో ప్రచారం చేస్తున్నా.. ఎక్కడా కూడా మోడీ మీద ఒక్క విమర్శ వినిపించలేదన్నారు. తాను తెలియని, తనను గుర్తు పట్టని కుటుంబం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో తెలియదన్నారు. వారికి ఎటువంటి చరిత్ర లేదన్నారు రాజేందర్.
ఇది కూడా చదవండి: TS Elections 2024: హైదరాబాద్ లోని ఓటర్లకు శుభవార్త.. ఫ్రీగా పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి..

ఇక్కడ తాము పోటీ పడలేమని రెండు పార్టీల నాయకులు అంటున్నారన్నారు. ఏ సర్వేలకు అందని ఫలితం మల్కాజ్ గిరిలో రాబోతోందన్నారు. ఇంటెలిజెన్స్ చేసిన సర్వేలో సైతం ఈటెల గెలుపు ఖాయమని వచ్చిందన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు కూడా తనకే ఓటేస్తామని భరోసా ఇచ్చారన్నారు. మల్కాజ్ గిరిలో కాషాయ జెండా ఎగరేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు రాజేందర్.

Advertisment
Advertisment
తాజా కథనాలు