FLASH: కేటీఆర్ పరువు నష్టం కేసు వాయిదా
TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును సోమవారం విచారణ చేపడుతామని నాంపల్లి కోర్టు తెలిపింది. ఆరోజే కేటీఆర్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని పేర్కొంది.
TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసును సోమవారం విచారణ చేపడుతామని నాంపల్లి కోర్టు తెలిపింది. ఆరోజే కేటీఆర్ నుంచి స్టేట్మెంట్ తీసుకుంటామని పేర్కొంది.
TG: సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శల దాడికి దిగారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందన్నారు.
TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనతో పైసా పని లేదు.. రాష్ట్రానికి లాభం లేదని అన్నారు కేటీఆర్. 10నెలల్లో 25 సార్లు హస్తిన పర్యటనకు రేవంత్ వెళ్లారని అన్నారు. అధిష్టాన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సీఎం రేవంత్ సిల్వర్ జూబ్లీ చేశాడని సెటైర్లు వేశారు.
TG: రాష్ట్రంలో పది నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ రూ.80,500 కోట్ల అప్పు చేసిందని అన్నారు కేటీఆర్. నాడు అప్పు తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? అని చురకలు అంటించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఇంత అప్పు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐదేళ్ల చిన్నారి గుండెపోటు మరణించడం స్థానికంగా కలచివేసింది. రాజు-జమున దంపతుల కూతురు ఉక్కులు నిన్న ఉదయం కళ్ళుతిరుగుతున్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షలు చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఆమె చనిపోయింది.
TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని NDSA నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ పరీక్షల ఫలితాలు వస్తేనే బ్యారేజీల భవితవ్యంపై పూర్తి నివేదికను అందించగలమని తేల్చిచెప్పింది.
మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం వేములవాడ ఆలయాన్ని దర్శించుకోగా స్వామివారి నైవేద్యాన్ని ఆపి మరీ అర్చకులు సురేఖ ఫ్యామిలీకి పూజలు చేశారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ నెల 18న కోర్టుకు హాజరై వాంగ్మూలం సమర్పించాలని కేటీఆర్ ను న్యాయస్థానం ఆదేశించింది.
దసరా పండుగ కోసం భాగ్య నగరాన్ని విడిచి వెళ్లిన వారంతా కూడా తిరిగి నగరానికి తిరిగి వస్తుండడంతో రోడ్లన్ని రద్దీగా మారాయి. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో అధికారులు వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లను ఏర్పాటు చేశారు