రేవంత్ ఇక చాలు.. KTR ఉచిత సలహా! తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు కేటీఆర్. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా...మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారని అన్నారు. By V.J Reddy 23 Nov 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి MLA KTR: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ చురకలు అంటించారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మలేదని అన్నారు. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా...మహారాష్ట్రలో 3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ హామీలు అమలు చేశామంటూ మహారాష్ట్రలో చెప్పిన అబద్దాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు! రేవంత్ ఇప్పటికైనా... రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు, అసత్యాలు మాని ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలహీనమవుతుందని అన్నారు. దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి లేదని విమర్శించారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైన సంకీర్ణశకం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అన్నారు. ప్రాంతీయ శక్తులను, ప్రాంతీయ పార్టీ నేతలను అణిచివేసే కుట్ర చేస్తే ప్రజలు ఎలా అండగా ఉంటారో ఝార్ఖండ్ ప్రజలు చూపించారని అన్నారు. ఇది కూడా చూడండి: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు? రాజకీయ కక్ష సాధింపు... రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓటుతో బుద్ధి చెప్తామని ఝార్ఖండ్ ఓటర్లు తేల్చిచెప్పారని అన్నారు కేటీఆర్. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, ఏక్ నాథ్ షిండే,అజిత్ పవార్లకు అభినందనలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన దొంగ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇది కూడా చూడండి: హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో! ఇది కూడా చూడండి: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు? #ktr #maharashtra election #ktr vs revanth reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి