/rtv/media/media_files/2024/11/18/c36X01IBJfuN89NlPWMg.jpg)
బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ సంగారెడ్డి జైలులో ఉన్న లగిచర్ల రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. రైతులపై పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని, జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా.. మానవత్వం లేకుండా రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సమ్మతి లేకుండా భూములు గుంజుకోవద్దన్నారు.
ఇది కూడా చదవండి: Maharashtra : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్
సంగారెడ్డి సెంట్రల్ జైలుకి చేరుకున్న బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ
— RTV (@RTVnewsnetwork) November 18, 2024
లగచర్ల కేసులో జైలులో ఉన్న 16 మందితో ములాఖత్ అయిన బీజేపీ నేతలు
సెంట్రల్ జైలు లోపలికి వెళ్లిన ఐదుగురు బీజేపీ నేతలు.@Eatala_Rajender @BJP4Telangana #Telangana #bjp #eatalarajender #centraljail #RTV pic.twitter.com/7J3QgqaHV2
కుట్ర చేసింది రేవంతే..
40 లక్షల విలువైన భూమిని 10 లక్షల రూపాయలకే ఇవ్వమంటే ఎలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తల్లిని బిడ్డను వేరు చేసినట్టు మా భూమిని మా నుండి వేరు చేయవద్దు అంటే వినరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు నిరసన ఇలానే కొనసాగితే ఈ నియోజకవర్గంలో తనకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని, తాను చేపట్టిన ప్రాజెక్ట్ ఆగిపోతే పరువుపోతుందని రేవంత్ రెడ్డి ఈ పని చేశారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: రాజకీయాలకు గుడ్ బై.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన
ఎంపీ శ్రీమతి @Aruna_DK గారితో కలిసి సంగారెడ్డి జైలులో ఉన్న లగిచర్ల రైతులను పరామర్శించడం జరిగింది.
— Eatala Rajender (@Eatala_Rajender) November 18, 2024
వారిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ:
లగ్గిచర్ల రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ తరఫున మేం చేస్తున్న డిమాండ్స్ :
👉 రైతులపై పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలి.
👉… pic.twitter.com/ey1DgP0I8d
కావాలనే కలెక్టర్ ను పిలిపించుకొని దాడులు చేయించారని ఆరోపించారు. ఆ దాడులు అడ్డం పెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎంపీగా తన ప్రజలను పలకరిద్దామని డీకే అరుణ గారు వెళ్తే అడ్డుకున్న పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ అంశంపై డీకే అరుణ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారన్నారు. ప్రజలకు అండగా ఉండే ఎంపీని అడ్డుకున్న వారిని ఢిల్లీ లో నిలబెడతామని హెచ్చరించారు.