కేటీఆర్‌కు బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు!

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు మరో షాక్ తగిలింది. నాంపల్లి స్పెషల్ కోర్ట్ లో ఆయనపై క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్‌పై వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్‌ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో సృజన్ కోర్టుకెక్కారు.

New Update
ktrrr

MLA KTR: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు, లగచర్ల కలెక్టర్ పై దాడి కేసులో ఇక్కట్లు పడుతున్న కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. నాంపల్లి స్పెషల్ కోర్ట్ లో ఆయనపై క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్‌పై వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్‌ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తుండడంతో సృజన్ కోర్టుకెక్కారు.

ఇది కూడా చదవండి: అంధులకు దారి చూపించే AI కళ్లద్దాలు.. చదివిస్తాయి కూడా

ప్రజలను తప్పుదారి పట్టించేలా...

ప్రజలను తప్పుదారి పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారంటూ పిటిషన్‌ లో పేర్కొన్నారు సృజన్. 2011లో శోధ కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభమయ్యిందని తెలిపారు. శోధ కన్‌స్ట్రక్షన్స్‌కు ఎండీగా కందాల దీప్తిరెడ్డి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను డైరెక్టర్‌ను కూడా కాదని వివరణ ఇచ్చారు. శోధ కన్‌స్ట్రక్షన్స్‌తో తనను లింక్ చేస్తూ కేటీఆర్ అందర్నీ తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా!

అన్ని తెలిసి.. కావాలనే!

అమృత్ 2లో ప్యాకేజ్‌ 1 కాంట్రాక్ట్‌ను  AMR-శోధ-IHP జాయింట్ వెంచర్‌ దక్కించుకుంది. జాయింట్ వెంచర్‌లో కేటీఆర్ చెబుతున్నట్లు శోధకు 80 శాతం కాకుండా 29 శాతమే వాటా. అమృత్ పనులకు e-టెండర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లు వేశారు. పారదర్శకమైన విధానంలోనే టెండర్ల కేటాయింపు జరిగినా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని సృజన్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రిగా కేటీఆర్‌కు టెండర్ల విధానంపై స్పష్టమైన అవగాహన ఉందనని చెప్పారు. అయినా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని.. లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్‌ రెడ్డి మీడియాతో చెప్పారు.

Also Read: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం..

Also Read: నేనే సీఎం.. షిండే సంచలన ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు