BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్? TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటిసులు అందించారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఈ నెల 9న బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఈక్రమంలో అనుమతి లేకుండా హైవేపై కౌశిక్‌రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసులిచ్చారు. By V.J Reddy 24 Nov 2024 in తెలంగాణ Short News New Update షేర్ చేయండి MLA Kosuhik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనకు పోలీసులు నోటిసులు అందించారు. దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఈ నెల 9న బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది. ఈక్రమంలో అనుమతి లేకుండా హైవేపై కౌశిక్‌రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసులిచ్చారు. కాగా ఏ క్షణమైనా కౌశిక్ రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దళితులతో ధర్నా..! ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేయాలంటూ కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో ధర్నా చేపట్టారు. రేవంత్ రెడ్డి దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకాన్ని రేవంత్ రెడ్డి అటకెక్కించారని నిప్పులు చెరిగారు. వెంటనే దళిత బంధు నిధులను విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. కాగా కౌశిక్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలవడంతో పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేశారు. ధర్నా TO ఆసుపత్రి.. కాగా ఆ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. కళ్ళుతిరిగి పడిపోయారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. అయితే.. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే.. కౌశిక్ రెడ్డి ఆనాడు సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశారని అన్నారు. ఈ క్రమంలోనే తనను పోలీసులు ఇలా పరోక్షంగా దాడికి దిగారని ఆరోపణలు చేశారు. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా హైవేపై కౌశిక్‌రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసుల్లో పేర్కొన్నారు . మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి