మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి పైగా అస్వస్థత! కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. మరో 20 మంది కడుపునొప్పితో విలవిల్లాడారు. ఈ ఘటన గంగాధర మండలం బూర్గుపల్లిలో జరిగింది. By Seetha Ram 23 Nov 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వ సీరియస్ కావడం.. అధికారులు వెంట వెంటనే ప్రభుత్వ పాఠశాలలకు పరుగులు పెట్టి చర్యలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. తరచూ ఏదో ఒక పాఠశాలను సందర్శించి అక్కడున్న సదుపాయాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: అంధులకు దారి చూపించే AI కళ్లద్దాలు.. చదివిస్తాయి కూడా కానీ ఫుడ్ పాయిజన్ సమస్య ఆగడం లేదు. ఇటీవలే నారాయణ పేట్ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది అస్వస్థకు గురయ్యారు. ఇది మరువక ముందే ఇప్పుడు మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఘటన ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా! కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మరో 20 మంది కడుపునొప్పితో విలవిల్లాడారు. వెంటనే ఉపాధ్యాయులు వైద్య సిబ్బందికి సమాచారం అందించడంతో.. పాఠశాలకు చేరుకున్నారు. ఆపై విద్యార్థులను పరీక్షించి మందులు అందించారు. ఇటీవల నారాయణ పేట్ జిల్లాలో ఘటన నారాయణపేట్ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు.. విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. Also Read : బుమ్రా దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు గజగజ.. 104 ఆలౌట్! వీళ్లలో కొందరికీ ప్రాథమిక చికిత్స అందించి వాళ్లకు ఇళ్లకు పంపించారు. మరో 9 మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స కోసం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వీళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మరికొందరికీ పాఠశాల వద్దే చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు.. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. '' ఇవి గురుకులాలా లేక నరక కుపాలా అంటూ ధ్వజమెత్తారు. పాఠశాలల లేక ప్రాణాలు తీసే విషయ వలయాలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంకిడి గిరిజన గురుకులంలో కూడా ఓ విద్యార్థిని ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్య పాలై 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతంటూ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి #karimnagar #government-school #food-poisoning మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి