Srushti Fertility Case :  నాకేం తెలియదు...విచారణలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డాక్టర్ నమ్రత

 సృష్టి ఫెర్టిలిటీ అక్రమ సరోగసీ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవరోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారిస్తున్నారు. మొదటి రోజైన నిన్న అక్రమ అండాలు, స్మెర్మ్ రవాణా, చైల్డ్ ట్రాఫికింగ్ విషయాలపై పోలీసులు ఎంత ప్రశ్నించిన నమ్రత ఎలాటి సమాధానాలు చెప్పలేదు.

New Update
Srushti Fertility Case

Srushti Fertility Case

సృష్టి ఫెర్టిలిటీ అక్రమ సరోగసీ కేసులో నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవరోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారిస్తున్నారు. మొదటి రోజైన నిన్న అక్రమ అండాలు, స్మెర్మ్ రవాణా, చైల్డ్ ట్రాఫికింగ్ విషయాలపై పోలీసులు ఎంత ప్రశ్నించిన నమ్రత ఎలాటి సమాధానాలు చెప్పలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తనకేం తెలియదనే సమాధానం తప్ప మరోమాట చెప్పలేదు. ఈ రోజుకూడా నమ్రత నోరు విప్పలేదు. ఆమెకు ఎవరెవరు సహకరించారు. ఈ దందాలో ఏజెంట్ల పాత్ర, ఆశా వర్కర్ల పాత్రపై విచారించినప్పటికీ ఏ మాత్రం స్పందించలేదు. ఇక తనపై కేసు పెట్టిన రాజస్థాన్ దంపతుల విషయంలో మాత్రం నోరు విప్పింది. వారికి సరోగసి చేసినట్లు చెప్పలేదని, వారికి దత్తత మాత్రమే ఇచ్చానని చెప్పుకొచ్చింది. 

ఇది కూడా చదవండి:  హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్..ఇక గాలిలో తేలిపోవాల్సిందే..

Srushti Fertility Case - Namratha

ఇదే కేసులో కీలకంగా ఉన్న మేనేజర్ కళ్యాణి, సంతోషిలను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని కూడా పోలీసులు కస్టడీకి కోరారు. ఈ రోజు వారు జైలు నుంచి పోలీసు కస్టడీకి తరలించనున్నారు. ఓవైపు నమ్రతను విచారిస్తూనే వీరిద్దరినీ కూడా ప్రత్యేకంగా విచారించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. నమ్రతతో పాటు.. వీరిని ఐదు రోజుల పాటు గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. ఏజెంట్ సంతోషి,  వైజాగ్ సృష్టి మేనేజర్ కళ్యాణి ఇప్పటివరకు ఎంతమంది దంపతులను సృష్టి హాస్పిటల్ కు తీసుకొచ్చారు? వైజాగ్ నుంచి ఎంతమంది పిల్లలను నమ్రత వద్దకు తీసుకువచ్చారు? తీసుకువచ్చినవారిలో ఎంత మందిని అమ్మారు? ఎవరెవరికీ అమ్మారు. వారిని ఎవరివద్ద కొన్నారు. ఎన్ని డబ్బులు చేతులు మారాయి అనే విషయలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మేనేజర్ గా ఉన్న కళ్యాణి పేద, గిరిజన ప్రాంతాలకు చెందిన మహిళలకు డబ్బు ఆశచూపి పిల్లలను తీసుకొని వచ్చి అవసరం ఉన్నవారికి విక్రయించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఆ దిశగా ప్రశ్నలు సంధించడానికి పోలీసులు సిద్ధమయ్యారు.

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ పేరుతో ఆస్పత్రి నడుపుతున్న డాక్టర్ నమ్రత తొలి రోజు కస్టడీలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో రెండోరోజు కూడా నమ్రత అదే రీతిలో ప్రవర్తించినట్లు తెలిసింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారించినా పోలీసులు నమ్రత నుంచి సరైన వివరాలు రాబట్టలేకపోయారు. అడిగిన ప్రతి ప్రశ్నకు నాకు తెలియదు.. గుర్తు లేదంటూ సమాధానం దాటవేసింది.

అయితే  పోలీసులు విచారణ తరువాత చంచల్ గూడ జైలుకు తరలిస్తున్న క్రమంలో నమ్రత మీడియాతో మాట్లడే ప్రయత్నం చేసింది. మీరు ఇంకా ఎంత మందిని ఇలా మోసం చేశారు? అని మీడియా అడిగిన  ప్రశ్నలకు స్పందించింది. నేను ఏం తప్పు చేయలేదు. "నేను శిశువిక్రయాలు చేయలేదు. రాజస్దాన్‌కు చెందిన గోవింద్ సింగ్, సోనియా లు కావాలనే నాపై తప్పుడు కేసు పెట్టారు. శిశువును దత్తత తీసుకుంటామని, భార్యభర్తలు మాతో చెప్పారని, దత్తతకు శిశువును ఏర్పాటు చేశామన్నారు. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో దత్తత విషయం చెప్పకుండా నాపై తప్పుడు కేసు పెట్టారు. ఫెర్టిలిటి కోసం వచ్చేవారిని సరోగసి వైపు మళ్లించాననడం అబద్ధం. లక్షల రూపాలయు వసూలు చేస్తున్నాననేది తప్పుడు ఆరోపణలు మాత్రమేనని నమ్రత అన్నారు. నేను ఎవరికీ శిశువులను విక్రయించలేదు. కోవిడ్ సమయంలో కూడా ఈ భార్యభర్తలు నన్ను ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు కూడా దత్తత తీసుకున్న విషయం చెప్పకుండా సరోగసి అంటూ నాపై తప్పుడు కేసులు పెట్టారు" అంటూ మీడియాతో వాపోయింది. అంతేగాక, డాక్టర్ నమ్రత మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం, ఐపీఎస్ సీతా రామాంజనేయులుపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది. ఆమె చేసిన ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి:రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 40 ఏళ్ల వ్యక్తితో బాలికకు వివాహం!

case against shrishti test tube center in secunderabad | secunderabad test tube baby center | srishti test tube baby center | Srishti Test Tube Centre | shrusti docto namratha | dr namratha | latest-telugu-news | latest telangana news | telugu crime news

Advertisment
తాజా కథనాలు