Universal Shrishti Fertility Center : సృష్టి ఐవీఎఫ్ కేసులో కీలక పరిణామం.. డా.నమ్రతకు 5 రోజుల పోలీసు కస్టడీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరోగసీ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రతను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపటి నుంచి 5 రోజుల పాటు ఆమెను విచారిస్తారు.