బిట్టూ నువ్ సూపర్ రా.. క్రికెట్‌పై ఇష్టం రూ.3900 కోట్ల ఆస్తిని కాపాడింది..!
జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఖాళీ స్థలంలో ఓ బాలుడు క్రికెట్ ఆడుకునేవాడు. కొన్నిరోజులుగా అక్కడ కంచె వేసి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఆ బాలుడు హైడ్రా కమిషనర్‌కు లెటర్ రాశాడు. ఆ చుట్టు పక్కల 39 ఎకరాలు ఆక్రమణకు గురైందని బయటపడింది.