Sri Rama Navami Shobha Yatra : వైభవంగా కొనసాగుతోన్న శ్రీరామ శోభాయాత్ర
హైదరాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. మంగళ్‌హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్ పేటకు చేరుకుంది.