TG Crime:  గోల్కొండలో ఘోరం.. బావను చంపిన బామ్మర్ది.. గొడవకు కారణం ఇదే!

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీ చేసిన బైక్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఎత్తుకొచ్చిన బైక్‌ను అమ్మి వాటా ఇవ్వలేదని బ్లేడ్‌తో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

New Update
annamaianh crime news

golkonda crime news

TG Crime: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. చోరీ చేసిన బైక్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. దొంగతనంగా ఎత్తుకొచ్చిన బైక్‌ను అమ్మి తనకు వాటా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. బావను బామ్మార్ది చంపేసిన ఘటన హైదరాబాద్‌ గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. గోల్కొండలో ముఖిత్‌, సమీర్‌ బావ బామ్మర్దులు నివాసం ఉంటున్నారు. ముఖిత్‌ బైక్‌ను   దొంగిలించారు. బైక్‌ అమ్మి డబ్బులు ఇవ్వాలని బామ్మర్ది సమీర్‌కు చెప్పాడు. అయితే.. ఆదివారం ఉదయం టోలిచౌకి నుంచి సెవెన్‌ టూంబ్స్‌ వెళ్లే రోడ్డులో ఉన్న ఓ హోటల్‌ వద్ద ఇద్దరు కలుసుకున్నారు.  డబ్బు ఇచ్చే విషయంలో వాదులాడుకున్నారు. 

ఇది కూడా చదవండి: వయస్సు 50 ఏళ్లు దాటిందా..? రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలో తెలుసా..?

బ్లేడ్‌తో దాడి చేసి...

ఇద్దరు మధ్య మాటామాట పెరిగి అదికాస్తా పెద్ద గొడవకు దారిసింది. ఈ సమయంలో సహనం కోల్పోయిన సమీర్‌.. బావ ముఖిత్‌పై బ్లేడ్‌తో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ముఖిత్‌ అక్కడికక్కడే మరణించారు. చుట్టు పక్క స్థానికుల ఇచ్చిన సమాచారంతో.. ఘటనా స్థలానికి  పోలీసులు చేరుకున్నారు.  అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడి సమీర్‌ కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నిజంగానే.. కాకరకాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా?

ts-crime | ts-crime-news | latest-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు