/rtv/media/media_files/2025/04/06/UdsT2KTqqNHFN5xNA30s.jpg)
Fake Baba
Fake Baba : మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేవో తెలియదు కానీ, మంత్రగాళ్లకు మాత్రం కాసుల భాగానే రాలుతున్నాయి. పేక్ బాబాలు, స్వామిజీలను నమ్మి చదువుకున్నవారు సైతం మోసపోతున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పేక్ గాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఫేక్ స్వామిని నమ్మిన మహిళ లెక్చరర్ రూ.20 లక్షలు పోగొట్టుకున్నారు.
Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి
ఈజీ మనీకి అలవాటుపడి ఫేక్ బాబులు, స్వామిజీల రూపంలో ప్రజల్ని దోచుకుంటున్నారు. జాతకాలు, విశ్వాసాలను ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రజలు కూడా వారిని గుడ్డిగా నమ్మి నట్టేట మునుగుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలో ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి దిష్టి పోగొట్టుతానంటూ ఓ ఫేక్ స్వామిజీని ఓ అధ్యాపకురాలిని మోసం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 20 లక్షలతో ఊడాయించాడు. కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also read: Husband suicide: కాజల్ వేధింపులు.. భరించలేక భర్త లైవ్ వీడియో చేసి సూసైడ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన ఓ మహిళ దిల్‌సుఖ్‌నగర్‌లోని జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుంది. భర్త చనిపోవడం, కుటుంబ పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో తరుచూ ప్రిన్సిపల్ తో చెప్పుకుని బాధపడేది. అయితే ఆమె బాధవిన్న ఆయన ఓ ఉచిత సలహ ఇచ్చాడు. దీంతో ఆయన చెప్పినట్లే ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ శివస్వామిని ఆశ్రయించింది. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న స్వామి ఓ రోజు ఆమె ఇంటికి వచ్చాడు. ఇంటి దోషం కారణంగా భర్త చనిపోయాడని చెప్పి నమ్మించాడు. పూజలు చేయకుంటే ఇంకా అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉందని భయపెట్టాడు. పూజల పేరుతో రూ. 1.70 లక్షలు వసూలు చేశాడు. కనకదుర్గ ఆలయంలో పూజల కోసం మరో 20 తులాల ఆభరణాలు లెక్చరర్ నుంచి తీసుకున్నాడు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
పూజలు చేస్తున్న క్రమంలోనే ఆలయ అర్చకుడు చనిపోయాడంటూ ఆమెను భయపెట్టాడు. అలా కాచిగూడలోని ఇంటిపత్రాలను సైతం కాజేశాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న అధ్యాపకురాలి కుమార్తె.. తల్లిని తీసుకుని శివస్వామి వద్దకు వెళ్లి గొడవ చేసింది. దీంతో తీసుకున్న ఇంటిపత్రాలను తిరిగి ఇచ్చేశాడు. నగదు, 20 తులాల బంగారం మాత్రం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!