Missing Case: ఆరుగురు కుటుంబసభ్యుల అదృశ్యం కేసులో పురోగతి.. ఎక్కడికెళ్లారంటే ?

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఆరుగురు కుటుంబ సభ్యులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పురోగతి కనిపించింది. వీళ్లందరూ ఎంజీబీఎస్‌ నుంచి విజయవాడ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు.

New Update
Missing Case

Missing Case

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉంటున్న ఆరుగురు కుటుంబ సభ్యులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసులో పురోగతి కనిపించింది. వీళ్లందరూ ఎంజీబీఎస్‌ నుంచి విజయవాడ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని వాళ్ల కుటుంబ సభ్యుడు నరేశ్ చెప్పారు. కానీ అందరీ ఫోన్లు వస్తుండటంతో ఆందోళనగా ఉందని చెబుతున్నాడు. అయితే వాళ్లందరూ తీర్థయాత్రలకు వెళ్లారేమోనని అనుమానిస్తున్నాడు. 

Also Read: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్....4 నెలల్లో 224 మంది సరెండర్

ఇదిలాఉండగా.. న్యూ బోయిన్‌పల్లిలో ఏడుగుళ్ల దగ్గర్లో మహేశ్‌, ఉమా దంపతులు ఉంటున్నారు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. మహేశ్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీళ్ల ఇంటికి గురువారం ఉదయం సంధ్య అనే మరో బంధువు వెళ్లింది. ఆ తర్వాత మహేశ్, ఉమా దంపతులు, వాళ్ల పిల్లలతో పాటు సంధ్య కూడా బయటకు వెళ్లిపోయింది. వీళ్లు మళ్లీ తిరిగిరాలేదు. దీంతో ఉమా సోదరుడు భిక్షపతి ఆందోళన చెందాడు. 

Also Read: జెలెన్‌స్కీ నగరంపై రష్యా దాడి.. 18 మంది మృతి

ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ ఆరుగురు ఓ ఆటో బుక్ చేసుకొని బోయిన్‌పల్లి నుంచి ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. ఆ తర్వాత వాళ్లు అక్కడి నుంచి విజయవాడకు వెళ్లినట్లు గుర్తించారు. వాళ్లు విజయవాడ వైపు ఎందుకు వెళ్లారో అనేదానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. 

telugu-news | rtv-news 

Advertisment
తాజా కథనాలు