HCU Land Issue Telangana Governament key decision
Hyderabad: HCU వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంచ గచ్చిబౌలి భూములపై వెనక్కు తగ్గినప్పటికీ భూములు వర్సిటీకి అప్పగించేందుకు సిద్దంగా లేమని స్పష్టం చేసింది.1500 ఎకరాల్లో ఎకోపార్క్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.
ఎకోపార్క్ నిర్మాణానికి ప్లాన్ సిద్ధం..
ఈ మేరకు సెంట్రల్ వర్సిటీని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్సిటీ భూముల్లో ఎకోపార్క్ నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేశామన్నారు. ఆందోళనల్లో పాల్గొన్నవారు నార్త్ ఇండియా విద్యార్థులేనని, తెలంగాణ వారు ఎవరు లేరన్నారు.-- తెలంగాణ అభివృద్ది చూడలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ఇక విద్యార్థులతో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని, అవసరమైతే ఒకడుగు వెనక్కు వేసినా పర్వాలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల ఉపసంఘానికి సూచించారు. రికార్డులు, కోర్టు తీర్పు ప్రకారం భూమి ప్రభుత్వానిదైనా, ప్రస్తుత వివాదం నేపథ్యంలో జాగ్రత్తగా అడుగేయాలని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసి, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనుకొనేవారికి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
lands | telugu-news | today telugu today telugu news