IT Raids: శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ రైడ్స్.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు

శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఐటీ అధికారులు రూ.5 కోట్లు స్వాధీనం చేసుకొని హార్డ్‌‌‌‌‌‌‌‌డిస్క్‌‌‌‌‌‌‌‌లు, పలు బ్యాంక్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులపై ఆరాతీస్తున్నారు.

New Update
sri chaitanya colleges

sri chaitanya colleges Photograph: (sri chaitanya colleges)

తెలుగు రాష్ట్రాలతోపాటు అనే ప్రాంతాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థ (Sri Chaitanya Educational Institutions) లపై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యప్ప సొసైటీలోని  శ్రీచైతన్య కార్పొరేట్ ఆఫీసు, ఏపీ, బెంగళూరు‌‌‌‌‌‌‌‌, చెన్నై, ఢిల్లీ, పుణే సహా దేశవ్యాప్తంగా ఉన్న  శ్రీచైతన్య విద్యాసంస్థల్లో సోమవారం ఉదయం ఏకకాలంలో ఐటీ సోదాలు ప్రారంభించారు. మంగళవారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.  మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కార్పొరేట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో  నగదు, హార్డ్‌‌‌‌‌‌‌‌డిస్క్‌‌‌‌‌‌‌‌లు, పలు బ్యాంకులకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకుట్టు తెలిసింది. ఐదు రోజుల సెర్చ్‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌తో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

Also Read :  లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి

IT Raids In Sri Chaitanya College

Also read: Mom sit on son: ఆడుతూ.. ఆడుతూ కొడుకు మీద కూర్చుంది.. బాలుడి ప్రాణం తీసిన తల్లి సరదా 

అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి దండిగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. శ్రీచైతన్య విద్యా సంస్థల లావాదేవీల సాఫ్ట్‌వేర్‌ను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. 2020లోనూ ఈ విద్యా సంస్థలపై ఐటీ సోదాలు  (IT Raids) జరిగాయి. శ్రీచైతన్య కాలేజీల ట్యాక్స్ చెల్లింపులపై అధికారులు ఆరాతీస్తున్నారు. ప్రతి ఏటా ఫీజుల పెంపుతో పాటు అధిక మొత్తంలో అనధికారిక లావాదేవీలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇందులో రెండు విధానాలను అవలంబిస్తున్నట్టు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించుకునే క్రమంలో అధికశాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని, అతి తక్కువ శాతం మాత్రమే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్ విధానంలో వసూలు చేస్తున్నారని ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

Also read: PM Modi: ప్రధాని మారిషస్ పర్యటన.. ఇండియా ఫండ్స్‌తో 20 ప్రాజెక్టులు ప్రారంభం

Also Read :  అబ్బా భలే ఉంది..ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం AI-జనరేటెడ్ పాట

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు