/rtv/media/media_files/2025/03/11/ValQ3biVcxYYDVrhNHtW.jpg)
fat mother incident Photograph: (fat mother incident)
తల్లి సరదా పదేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. అనుకోకుండా కొడుకు చావుకు కారణమైన తల్లికి కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష వేసింది. ఈ ఘటన అమెరికాలోని ఇండియానా రాష్ట్రం వాల్పరైసోకులో జరింగింది. జెన్నిఫర్ విల్సన్‌కు 10ఏళ్ల డకోటా స్టీవెన్స్ అనే పెంపుడు కొడుకు ఉన్నాడు. సరదాగా ఆటపట్టిస్తూ ఆమె అతనిపై కూర్చుంది. అయితే ఆమె బరువు 340 పౌండ్లు అంటే దాదాపు 150 కేజీలు. జెన్నిఫర్ విల్సన్ ఆమె పెంపుడు కొడుకు డకోటా మీద దాదాపు ఐదు నిమిషాలపాటు కూర్చిందట. బాలుడికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అయితే జెన్నిఫర్ మాత్రం అతడు నటిస్తున్నాడనుకొని అతనిపై 5 నిమిషాలపాటు అలాగే కూర్చింది.
Also read: PM Modi: ప్రధాని మారిషస్ పర్యటన.. ఇండియా ఫండ్స్‌తో 20 ప్రాజెక్టులు ప్రారంభం
340 pound Jennifer Lee Wilson has been sentenced to six years in prison after she admitted to sitting on her foster son for misbehaving. She sat on him for a few minutes which crushed and killed him. pic.twitter.com/etjK8tkFWL
— Adam Bourgeois (@ThAdamBourgeois) March 9, 2025
పదేళ్ల బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. డకోటా కళ్లు మూసుకుపోయాయి. దీంతో తల్లి జెన్నిఫర్ కొంతసేపు సీపీఆర్ చేసింది. అయినా అతనిలో ఎలాంటి చలనం లేదు. అంబులెన్స్‌కు కాల్ చేసి హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. డకోటా స్టీవెన్స్ చికిత్స పోందుతూ చనిపోయాడు. తెలియక చేసినా జన్నిఫర్ ఈ తప్పు నుంచి తప్పించుకోవాలని చూసింది. బాబు ఇంటి నుంచి వెళ్లి పక్కింట్లో స్పృహ కోల్పోయి కనిపించాడని ఆమె పోలీసులకు చెప్పింది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు విచారణలో తెలిపింది. అయితే డకోటా స్టీఫెన్ మృదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు పోలీసులు. డకోడా మెడ, చాతిపై గాయాలు ఉన్నాయి. అనుమానంతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారణ చేశారు. పెంపుడు తల్లి అయిన జెన్నిఫర్ ఆమె కొడకు డకోటా స్టీవెన్స్‌పై కూర్చోవడం వల్లే చనిపోయాడని తేలింది. ఈ ఘటన 2023 ఏప్రిల్ 25న జరిగింది. 2025 మార్చి 10న కోర్టులో తీర్పు వచ్చింది. 48 ఏళ్ల విల్సన్ నిర్లక్ష్యంతోనే ఆమె పెంపుడు కుమారుడి డకోటాను హత్య చేసిందని కోర్టు పేర్కొంది. హత్య చేసినందుకు దోషిగా నిర్ధారించబడిన తర్వాత, ఆమెకు 6 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Also read: Hyderabad: విషాదం.. ఫార్మసీ విద్యార్థిని బలిగొన్న రెండుక్షరాల ప్రేమ