AI Music Video: హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వి మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'టక్ టక్ '. సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిత్రవాహిని, RYG సినిమాస్ బ్యానర్లపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాములు రెడ్డి నిర్మించారు. . ఈ చిత్రం మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి మరో కొత్త పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
Embrace the soulful melody with AI-powered visuals ❤️✨️
— Saanve Megghana (@SaanveMegghana) March 8, 2025
The futuristic beats of #RuRu will take you to a new world🔥
Presenting AI Music Video from #TukTuk
-- https://t.co/YVeE1ZBG6N#TukTukOnMarch21@NihalKodhaty1 @SaanveMegghana #SupreethCKrishna #RahulReddy pic.twitter.com/i0AqDE1G0C
AI-జనరేటెడ్ పాట
అయితే భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి పాటను రూపొందించడం ఇదే తొలిసారి. 'టక్ టక్ ' చిత్రంలో AI- టెక్నాలజీ ఉపయోగించి పాటను షూట్ చేశారు. నటీనటులపై AI విజువల్స్ అప్లై చేసి పాటను అందంగా చిత్రీకరించారు. తాజాగా విడుదలైన ఈపాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. విజువల్స్ తో పాటు మ్యూజిక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సంతు ఓంకార్ సంగీతం అందించిన ఈ పాటకు డైరెక్టర్ సుప్రీత్ సి కృష్ణ సాహిత్యం అందించగా పవిత్ర నార్కినబిల్లి, సంతు ఓంకార్ పాడారు.
ఇది కూడా చూడండి: Payal Rajput: హీరోతో నటి పాయల్ పెళ్లి.. అతడు మరెవరో కాదు..!
సాంగ్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ పాటకు AI టెక్నాలజీని ఉపయోగించడం పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. "ఇండియన్ సినిమాలో తొలిసారిగా AI టెక్నాలజీని ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉందని తెలిపారు. ప్రేక్షకులు ఈ పాటను థియేటర్లలో ఖచ్చితంగా ఆస్వాదిస్తారని అనుకుంటున్నానని అన్నారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!