లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  17వ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం దుర్మారణం చెందారు. ప్రమాదవశాత్తు లిప్టులో పడి మృతి చెందారు.  వెంకట్రావునగర్ లో సోమవారం రాత్రి సిరిసిల్ల డిఎస్పీని పరామర్శించి లిప్టులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
gangaram

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  17వ బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం దుర్మారణం చెందారు. ప్రమాదవశాత్తు లిప్టులో పడి ఆయన మృతి చెందినట్లుగా స్థానికులు వెల్లడించారు.  సిరిసిల్ల పట్టణం వెంకట్రావునగర్ లో సోమవారం రాత్రి సిరిసిల్ల డిఎస్పీని పరామర్శించి లిప్టులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మూడో ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా ఒకటో ఫ్లోర్ ఉన్న లిఫ్ట్‌పై గంగారం పడిపోయాడు.

తీవ్రంగా  గాయపడిన గంగారాంను

ఈ ఘటనలో తీవ్రంగా  గాయపడిన గంగారాంను రాత్రి ఫైర్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.  అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు.  గంగారాంకి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్ ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు.  నిజామాబాద్ జిల్లాకు చెందిన గంగారం సిరిసిల్ల 17వ బెటాలియన్ కమాండెంట్ గా బాధ్యతలు చేపట్టి  కేవలం మూడు నెలలు మాత్రమే అవుతుంది. ఆయన మృతి పట్ల పోలీసులు సంతాపం తెలిపారు.  

Also Read :  Subhman Gil: సచిన్ కూతుర్ని వదిలేసినట్టేనా.. కొత్త అమ్మాయితో గిల్ డేటింగ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు