PM Modi: ప్రధాని మారిషస్ పర్యటన.. ఇండియా ఫండ్స్‌తో 20 ప్రాజెక్టులు ప్రారంభం

ప్రధాని మోదీ 2 రోజుల మారిషస్ పర్యటనకు వెళ్లారు. మార్చి 11, 12 తేదీల్లో ఇండియా సహకారంతో జరిగిన అభివృద్ధి పనులను ఆయన ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులంతో కలిసి ప్రారంభించనున్నారు. అలాగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

New Update
_visit to Mauritius

_visit to Mauritius Photograph: (_visit to Mauritius)

ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోదీ రెండు రోజు పర్యటనకు గానూ మారిషస్ వెళ్లారు. మార్చి 11, 12 తేదీల్లో ఆయన అక్కడే ఉండనున్నారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులం ఆహ్వానం మేరకు ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి మోదీ అక్కడికి వెళ్లారు. మోదీ ఈ పర్యటన రెండు దేశాల మధ్య సరికొత్త యుగం ప్రారంభమవుతుందని తెలిపారు. వివిధ రంగాలలో మారిషస్‌తో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అవసరం గురించి ఆయన చెప్పారు. భారతదేశం నిధులతో నడిచే 20కి పైగా ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.

మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గూడల్‌తో కలిసి మోదీ కొత్తగా నిర్మించిన సివిల్ సర్వీసెస్ కాలేజ్ బిల్డిండ్ ప్రారంభిస్తారు. జనవరి 2022లో, మారిషస్ అంతటా 96 కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడానికి రెండు దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఏరియా హెల్త్ సెంటర్, 20 కమ్యూనిటీ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. భారతదేశం మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్, సుప్రీంకోర్టు భవనం, కొత్త ENT హాస్పిటల్, సోషల్ హౌసింగ్ ప్రాజెక్ట్ మరియు పాఠశాల పిల్లలకు డిజిటల్ టాబ్లెట్‌లతో సహా ఐదు కీలక ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలో భాగంగా మారిషస్‌కు USD 353 మిలియన్లను మంజూరు చేసింది. మారిషస్, ఇండియా మధ్య వాణిజ్యం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. 15 సంవత్సరాల చర్చల తర్వాత ఫిబ్రవరి 2021లో రెండు దేశాలు సమగ్ర ఆర్థిక సహకారం, భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు