/rtv/media/media_files/2025/02/05/uo7k54KFsOSE3U7Gr1Ly.jpg)
jeeth
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ఇంట మరో రెండు రోజుల్లో పెళ్లి బజాలు మోగబోతున్నాయి. ఆయన చిన్న కుమారుడు జీత్ అదానీ కి దివా జైమిన్ షా తో ఫిబ్రవరి ఏడున పెళ్లి జరగనుంది. దివా,గుజరాత్ కి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్‌షా కుమార్తె. ఈ నేపథ్యంలో ఇటీవల షార్క్ ట్యాంక్ ఇండియా షోలో జీత్ తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
Also Read: ChatGPT:అందుబాటులోకి చాట్ జీపీటీ వాట్సాప్ లో మరో కొత్త సదుపాయం!
షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జి, షాదీ.కామ్ సీఈఓ అనుపమ్ మిత్తల్ తో మాట్లాడుతూ.. మా కుటుంబానికి చెందిన ఓ స్నేహితుని ద్వారా దివా నాకు పరిచయమైంది అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే జిత్ షాదీ. కామ్ లో ఉన్న తన ప్రొఫైల్ ను తొలగించాలని జీత్ సరదాగా కోరారు. 8 వ గ్రేడ్ చదువుతున్నప్పుడు ఆ వయసులో అబ్బాయిలు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందేగా.ఒకరి మీద ఒకరు ప్రాంక్ చేసుకుంటుంటారు.
నా ప్రొఫైల్ తొలగించండి...
స్నేహితుల్లో ఒకరు మీ వివాహ వేదికలో నా ప్రొఫైల్ క్రియేట్ చేశారు. అయితే ఎవరి ఇ మెయిల్ , ఫోన్ నంబర్ ఇచ్చారో మాత్రం నాకు తెలియదు.దానిని తొలగించడానికి నేను చాలాప్రయత్నించాను. ఇప్పుడు నా పెళ్లి జరగబోతోంది. మీ వెబ్ సైట్ లో ఉన్న నా ప్రొఫైల్ తొలగించండి అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే..తన చిన్న కుమారుడి పెళ్లి నిరాడంబరంగా , సంప్రదాయ పద్ధతిలో ఉంటుందని ఇదివరకే గౌతమ్ అదానీ వెల్లడించారు. జీత్ అదానీ,యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ లో పట్టా పొందిన విషయం తెలిసిందే.
2019 లో అదానీ గ్రూప్ లో చేరారు. స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ మార్కెట్స్ వంటి విభాగాల బాధ్యతలు చూస్తున్నారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్ కు కూడా నాయకత్వం వహిస్తున్నారు.
Also Read: Hema Malini: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఎంపీ హేమామాలిని వివాదస్పద వ్యాఖ్యలు