/rtv/media/media_files/2025/02/04/wzKKRkNl4NJjaXQCFalj.jpg)
Telangana government SC Classification three groups divided
SC Classification: ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక అంశంపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. SCలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించినట్టు కమిషన్ తెలిపింది. అలాగే SC లను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని సిఫారసు చేసింది.
SC లను 3 గ్రూపులుగా విభజించారు.
1) గ్రూపు 1లో 15 కులాలను కలిపారు. 1% రిజర్వేషన్. ఈ గ్రూపుకు రోష్టర్ పాయింట్ 7
2) గ్రూపు 2లో 18 మాదిగ ఉపకులాలు కలిపారు. 9% రిజర్వేషన్.
ఇందులో రోష్టర్ పాయింట్స్ 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97.
3) గ్రూపు 3లొ 26 మాల ఉపకులాలున్నాయి. 5% శాతం రిజర్వేషన్.
ఈ గ్రూపులో రోష్టర్ పాయింట్స్ 22, 41, 62, 77, 91.
గ్రూప్-1లోని 15 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ (15 ఉపకులాల జనాభా 3.288శాతం). ఇక గ్రూప్-2లోని 18 ఎస్సీ ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్. (18 ఉపకులాల జనాభా 62.748శాతం). గ్రూప్-3లోని ఎఎస్సీ 26 ఉప కులాలకు 5శాతం రిజర్వేషన్. (26 ఉప కులాల జనాభా 33.963శాతం). కాగా జనాభా శాతం ఆధారంగా వర్గీకరణ కల్పించాలని వర్గీకరణ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాదు రాష్ట్ర ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనమండలి సైతం ఆమోదం తెలపడం విశేషం.
Also Read: లోక్‌సభలో అరవింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ..
Also Read: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమోషనల్.. ఎందుకంటే?
ఇక తెలంగాణ కులాల వారీగా సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.
సామాజిక ఆర్దిక రాజకీయ కుల గణన ప్రకారం:
BC: 1,64,09,179 (46.25%)
-బీసీ ముస్లింలు: 35,76,588 (10.08%)
మొత్తం బీసీలు:
46.25%+10.08%= (56.34%)
1 కోటి 99 లక్షల 85 వేల 767 వందలు
SCలు: 61,84,319 (17.43%)
ST లు : 37,05,929 (10.45%)
మొత్తం ముస్లింలు: 44,57,012 (12.56%)
బీసీ ముస్లింలు: 35,76,588 (10.08%)
OC ముస్లింలు: 8,80,424 (2.48%)
ఇతర OCలు: 44,21,115 (13.31%)
మొత్తం OC జనాభా:
53 లక్షల 01530
13.31%+ 2.48% = (15.79%)
Also Read: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే