AP politics:జగన్ సర్కార్ కు కాగ్ చురకలు.. నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కూడా..
రాజధాని అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని కాగ్ తన నివేదికలో పరోక్షంగా తెలిపింది. రాజధాని కోసం భూ సేకరణ నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొనకుండా, రాజధానికి అవసరమైన భూమి మొత్తంలో 70 శాతం భూ సమీకరణ విధానం ద్వారా సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం , రాబోయే కాలంలో భారీ ఆర్థిక భారం పడిందని కాగ్ తన నివేదికలో తెలిపింది. అలాగే జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల చేయడం వల్ల నిధులు నిరుపయోగం అయ్యాయని కాగ్ తన నివేదికలు తేల్చి చెప్పింది.