/rtv/media/media_files/2025/05/28/rlEKagwIvasg7f3AurGH.jpg)
KCR and Harish Rao
Harish Rao-KCR Meeting: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని నివాసంలో ఆయన్ను కలిశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు వెళ్లాలా వద్దా అనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆరగంటకు పైగా సమావేశం కొనసాగుతోంది.
రెండు రోజుల వ్యవధిలనే రెండు సార్లు ఆగమేఘాల మీద హరీష్ రావుతో కేసీఆర్ భేటీ కావడం చర్చనీయంశంగా మారింది. మరోవైపు వీరి భేటీ సందర్భంగా కవిత అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పెడుతుందన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వీరి ఇరువురి మధ్య ఆ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
కాగా ఇటీవల కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన తర్వాత హరీష్‌రావు కేసీఆర్‌ను మూడుసార్లు కలిశారు. గత వారం రోజుల క్రితం రెండుసార్లు కలిసిన ఆయన మళ్లీ ఈ రోజు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.గత గురువారం కేసీఆర్ తో హరీశ్ రావు మూడున్నర గంటల పాటు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుసింది. నోటీసులు వచ్చాక విషయంపై ఆలోచిద్దామని హరీశ్ కు కెసిఆర్ చెప్పినట్లు సమాచారం.
Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
కాగా, కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావులతో పాటు నాడు ఆర్థికమంత్రిగా ఉన్న నేటి మల్కాజీగిరి బిజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. దీంతో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్‌రావు, 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరుకావాల్సిందిగా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.
Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ
Also Read : BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే