Liberian ship: కొచ్చి తీరంలో హై అలర్ట్‌..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?

లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలోఉన్న కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
liberian ship

liberian ship

Liberian ship: లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలోఉన్న కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తెలుస్తోంది. విఝింజమ్‌ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరిన 184 మీటర్ల పొడవున్న ఎంఎస్‌సీ ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్‌ చేరుకోవాల్సి ఉంది. ఆ నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దీంతో ఇండియన్ కోస్ట్ గాడ్స్ రంగంలోకి దిగారు. అందులోని 24 సిబ్బందిని రక్షించారు.ఈ నౌకలో 640 కంటైనర్లు ఉండగా.. వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్,  367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Wine: ఈ వైన్ రోజుకీ ఒక సిప్ తాగితే.. కలిగే ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండరు

ప్రస్తుతం నౌక సముద్రంలో మునిగి పోవడంతో అందులో ఉన్న రసాయనాలు లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. కంటైనర్లు, అందులోంచి బయటకు వచ్చిన ఇంధనం తీరంవైపునకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా లీకైన ఇంధనం సముద్ర జలాల్లో ఎంత మేరకు వ్యాపించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ‘ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ’ వినియోగించే విమానం సముద్రంపై చక్కర్లు కొడుతోంది. ఇందులోని రసాయనాలు సముద్రంలో కలిస్తే తలెత్తే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తు  చర్యలు తీసుకుంటున్నామని కోస్టల్ గార్డ్స్ తెలిపారు.

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక శనివరం కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో మొదట పక్కకు ఒరిగింది. దీంతో అందులోని కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి.కంటైనర్‌ నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ICG) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. అందులో ఉన్న మొత్తం 24మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే నౌక పూర్తిగా మునిగిపోవడంతో కంటైనర్లలో ఉన్న రసాయనాలు సముద్రంలో కలిస్తే ప్రమాదమని భావిస్తున్నారు. అధికారులు జాగ్రత్తలు చేపట్టారు.

Also Read: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు